కూటమి ప్రభుత్వం గడచిన రెండేళ్లుగా ఒక్క హామీని కూడా సమర్థవంతంగా పూర్తి చేయలేకపోయిందని, దీనిపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శుక్రవారం నరసన్నపేట
వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి నేడు ప్రభుత్వం లో కొనసాగుతున్న చంద్రబాబు సూపర్ సిక్స్ అమలులో విఫలమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు కుంభ రవిబాబు పాల్గొన్నారు.