ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు గణనను బాధ్యతగా చేపట్టాలని బీఎల్‌వోలకు ఎన్నికల అధికారి బి. జయదేవి సూచించారు. శుక్రవారం నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో పోలాకి, నరసన్నపేట మండలాల బీఎల్‌వోలతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ మేరకు తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమై వచ్చే నెల 14వ తేదీతో ముగుస్తుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బందితో పాటు అధికారులు పాల్గొన్నారు.