నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రయాణికులు లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంప్లెక్స్ వెళ్లే రహదారి ఎదురుగా ఉన్న మురుగు కాలువపై ఏర్పాటు చేసిన సిమెంట్ పలకలు సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్ గేట్, అవుట్ గేట్ల ద్వారా లోపలికి వెళ్లాల్సి వస్తోంది. ఈ రహదారుల్లో బస్సుల రాకపోకల సమయంలోనూ ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి.