నరసన్నపేట: అమరవీరుల త్యాగాలు మరువలేనివి

2చూసినవారు
నరసన్నపేట: అమరవీరుల త్యాగాలు మరువలేనివి
దేశ రక్షణ కోసం అమరులైన జవానుల సేవలు మరువలేనివని హెచ్ఎం వకుళ రత్నమాల తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండలం సత్యవరం జడ్పీ పాఠశాలలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. గాంధీజీ గాడ్సే చేతిలో మృతి చెందిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్