నరసన్నపేట: గొట్టిపల్లి దుర్గమ్మ ఆలయంలో చోరీ.. కేసు నమోదు

4చూసినవారు
నరసన్నపేట మండలం గొట్టిపల్లిలోని శ్రీ దుర్గమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆదివారం ఉదయం ఆలయ అర్చకులు తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి గ్రామస్తులకు, అనంతరం టిడిపి నాయకుడు అవ్వ కుమార్ ద్వారా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కే శేఖర్ రావు సిబ్బందితో వచ్చి పరిశీలించగా, 5 శతమానాలు, హుండీ చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్