నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, పోలాకి, సంతబొమ్మాలి, సారవకోట మండలాలలో అమ్మవారి ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం అరెస్టు చేశారు. చేపూరి శేఖర్, మోతి జీవరత్నం, చింతాడ మధులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 28 గ్రాముల బంగారం, 175 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.