నరసన్నపేట మండలం శివరాంపురం ప్రభుత్వ ఫౌండేషన్ పాఠశాలలో కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వీరి కోసం ఒక ఉపాధ్యాయుడు బోధన చేస్తున్నారు. బుధవారం ఎంఈఓ ఉప్పాడ శాంతారావు పాఠశాలను పరిశీలించి, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తల్లిదండ్రులతో మాట్లాడాలని సూచించారు.