నరసన్నపేట: ప్రాణాలు కాపాడే వారికి గూడు కరువైంది

1చూసినవారు
నరసన్నపేటలోని వంశధార కాలనీ వద్ద 108 సిబ్బంది శిథిల భవనంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలలో తక్షణమే స్పందించి ప్రాణాలు కాపాడుతున్న వీరికి సరైన వసతి లేకపోవడం దుస్థితిగా మారింది. శిథిల భవనంలోకి పాములు కూడా వస్తున్నాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనతో విధులు నిర్వర్తిస్తున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత వసతి కల్పించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్