నరసన్నపేట: శ్రీ వెంకటేశ్వరునికి భక్తిశ్రద్ధలతో తులసి దళార్చన

78చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శయన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిశ్రద్ధలతో తులసి దళార్చన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి సాయి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

సంబంధిత పోస్ట్