నరసన్నపేట: ఢీకొన్న ద్విచక్ర వాహనాలు.. ఇరువురికి గాయాలు

2చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని పోలాకి రహదారిలో సంత తోట వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నరసన్నపేటకు చెందిన రావాడ జనార్ధన రావు, పోలాకి మండలం గాతల వలస కు చెందిన బొరిగి మధుసూదనరావు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఒకరు నరసన్నపేట ఆసుపత్రిలో, మరొకరు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్