నరసన్నపేట: దూకులపాడు లో భక్తిశ్రద్ధలతో ఏకాహం ప్రారంభం

6చూసినవారు
నరసన్నపేట మండలం దూకులపాడు పంచాయితీ కేంద్రంలోని శ్రీ జ్యోతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏకాహం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. సర్పంచ్ అల్లు అసిరి నాయుడు మాట్లాడుతూ, శనివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్