నరసన్నపేటలోని శ్రీరామ గీత మందిరంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీకృష్ణ సమేత గోదాదేవి అమ్మవారి ఉంజల్ సేవను బుధవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు పీసపాటి సూరిబాబు మాట్లాడుతూ, ప్రతి ఏడాది ధనుర్మాసంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.