నరసన్నపేట మండలం రావులవలస బిసి కాలనీలో గతంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం నిర్వహణ లోపంతో నీరు వృధా అవుతోంది. ట్యాంక్ లీకవడంతో గత కొన్ని రోజులుగా త్రాగునీరు వృధాగా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని మరమ్మత్తుల కోసం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో పరిస్థితి తీవ్రంగా మారిందని వారు తెలియజేస్తున్నారు.