కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా ఎదగాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వం మంజూరు చేసిన చెత్త నుండి సంపద సేకరణ ట్రై సైకిల్స్ ను 34 పంచాయతీలకు ఆయన పంపిణీ చేశారు. స్వచ్ఛ గ్రామంగా అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.