నరసన్నపేట వ్యవసాయ కార్యాలయంలో బుధవారం వ్యవసాయ శాఖ అధికారి వై సూర్యకుమారి మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన భూసార పరీక్షల్లో 200 మంది రైతుల భూముల్లో జింక్ శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దీనితో ఆయా రైతులకు జింక్ సల్ఫేట్ ను ఉచితంగా అందజేస్తున్నామని, దీని వాడకంతో భూసారం తిరిగి పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.