కూటమి ప్రభుత్వం రైతులకు సేవలు అందించేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం పోలాకి మండలం దీర్ఘాసి సచివాలయ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో జరిగిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రభుత్వం రైతులకు 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని అందించిందని, రైతులకు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.