పోలాకి మండలం కొత్తరేవు పంచాయితీ పరపతి వాని పేట వద్ద ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కర్రల వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. గురువారం రైతులు ఈ విషయాన్ని వెల్లడించారు. పంట పొలాలకు గెడ్డ దాటుకుని వెళ్లేందుకు ప్రమాదకరంగా మారడంతో తామే ఈ వంతెనను నిర్మించుకున్నామని, ఇప్పుడు అది కూలిపోవడంతో అధికారులు వెంటనే స్పందించి కొత్త వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు.