పోలాకి: ఎన్టీఆర్ భద్రతా పింఛన్లు పంపిణీ.. ఎమ్మెల్యే బగ్గు

0చూసినవారు
పోలాకి: ఎన్టీఆర్ భద్రతా పింఛన్లు పంపిణీ.. ఎమ్మెల్యే బగ్గు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం నిరుపేదలను ఆదుకుంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శనివారం పోలాకి మండలం మబగాం గ్రామంలో ఎన్టీఆర్ భద్రత పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి నెలా ఒకటవ తేదీనే నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్