కూటమి ప్రభుత్వ హయాములో రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం పోలాకి మండలం కొల్లివలసలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు రాజముద్రతో పంపిణీ చేసేందుకు గాను జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలను గుర్తించి, నేడు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.