పోలాకి మండలం 9వ క్లస్టర్ పరిధిలోని ఈదుల వలసలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అభిమానులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.