టెక్కలి డివిజన్ శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్, మహిళ పిసి యమున బుధవారం పోలాకి మండలం సుసరాం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెల్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని వారు సూచించారు. రీల్స్ చూడటంతో పాటు, ఈ యాప్ పై కూడా దృష్టి సారించాలని, ప్రమాద సమయంలో ఇది ఆదుకుంటుందని తెలిపారు.