కూటమి ప్రభుత్వ హయాంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ
ఎన్టీఆర్ భద్రత పెన్షన్లు అందిస్తామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం పోలాకి మండలం దీర్ఘాసి సచివాలయ పరిధిలో పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోయినా పింఛన్లు 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.