పోలాకి: పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన అవసరం.. డిపిఓ గోపి బాల

0చూసినవారు
పోలాకి: పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన అవసరం.. డిపిఓ గోపి బాల
జిల్లా పంచాయతీ అధికారి గోపి బాల శనివారం పోలాకి మండలం సంత లక్ష్మీపురం పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో పరిశుభ్రత పట్ల గ్రామస్తులతో పాటు సంబంధిత అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు చెత్త, వ్యర్థాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, రోడ్లపై వ్యర్థాలను వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు నేరుగా అందజేయాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్