పోలాకి: సముద్ర తీర ప్రాంతంలో పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి

7చూసినవారు
పోలాకి: సముద్ర తీర ప్రాంతంలో పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి
మంగళవారం సాయంత్రం నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు పోలాకి మండలం రాజారాంపురం, కొత్త రేవు, గుల్లవానిపేట, గుప్పిడి పేట సముద్ర తీర ప్రాంతాలలో పర్యాటకులకు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. రాజారాంపురం గ్రామం వద్ద స్థానిక మత్స్యకారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, పర్యాటకులకు సూచనలు ఇచ్చే విషయంలో మత్స్యకారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి రంజిత్, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్