నరసన్నపేట వైసిపి కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

5చూసినవారు
నరసన్నపేట వైసిపి కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
నరసన్నపేట మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో స్వర్గీయ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి ధర్మాన కృష్ణ చైతన్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :