సారవకోట: సాధన తోనే ఉత్తమ ఫలితాలు సుసాధ్యం.. ఎంఈఓ

1చూసినవారు
సారవకోట: సాధన తోనే ఉత్తమ ఫలితాలు సుసాధ్యం.. ఎంఈఓ
సారవకోట మండలం చిన్న కిట్టాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంఈఓ మడ్డు వెంకటరమణ శనివారం సందర్శించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ ను పరిశీలించారు. విద్యార్థి దశ నుండే సాధన చేయగలిగితే ఉత్తమ ఫలితాలు సుసాధ్యమవుతాయని, విద్య పట్ల సాధన అవసరమని, తద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన విద్యార్థులతో అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్