సారవకోట మండలం పాతూరు ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఎల్ కౌశిక్ రాష్ట్రస్థాయి గురుకుల ప్రవేశ పరీక్షలలో 265 ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచాడని హెచ్ఎం ఏ యశశ్రీ తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. పాఠశాల విద్యార్థి సాధించిన ఈ విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.