సారవకోట మండల కేంద్రంలో బుధవారం 108 వాహనాన్ని టెక్కలి డివిజన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ జి జగన్నాధ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వాహనంలో ఉన్న పరికరాలను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, మరమ్మత్తులు జరిగితే వెంటనే సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలో స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.