ప్రభుత్వ పాఠశాలల్లో గణిత పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ మడ్డు వెంకటరమణ తెలిపారు. గురువారం సారవకోట మండలంలో ఆయన పరీక్షలను పరిశీలించారు. సిక్కోలు గణిత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయని, పాఠశాల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు మండల స్థాయిలో నవంబర్ రెండో తేదీన ఆదివారం విజేతలతో పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.