సారవకోట మండలం చిన్న కిట్టాలపాడు జడ్పీ పాఠశాలను శుక్రవారం సందర్శించిన ఎంఈఓ 1 మడ్డు వెంకటరమణ, విద్యార్థులు ఇష్టపడి చదివి సత్ఫలితాలు సాధించాలని సూచించారు. పదో తరగతి పరీక్షలలో ఉన్నత ఫలితాలు సాధించేలా కృషి చేయాలని, బోధనలో ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని, యాక్షన్ ప్లాన్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.