ఆదివారం సారవకోట మండలం పెద్దలంబ రహదారిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బత్తిలి గణపతి (34) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. తెంబురు నుండి పెద్ద లంబ స్కూటీపై వస్తున్న గణపతిని ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎస్సై అనిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.