విద్యార్థులకు సైన్స్ ప్రయోగాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ ప్రయోగాత్మకంగా బోర్డుపై రాసి చూపించారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ఉన్న ఓ ప్రైవేటు స్మార్ట్ స్కూల్‌లో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో పరిశోధనా జిజ్ఞాసను పెంపొందించేలా పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. 500 మంది విద్యార్థులు 175 ప్రాజెక్టులు చేశారు.