యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం శ్రీకాకుళంలో మాట్లాడుతూ, బుధవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. పిఆర్సి, సిపిఎస్, బకాయిలు, పిఆర్సి కమిటీ ఏర్పాటు వంటి డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.