నరసన్నపేటలో ఆక్రమణలపై చర్యలు తీసుకోండి.. వైసిపి నేతలు

4చూసినవారు
నరసన్నపేటలో ఆక్రమణలపై చర్యలు తీసుకోండి.. వైసిపి నేతలు
నరసన్నపేట పట్టణంలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ వైసిపి నేత, జడ్పిటిసి సభ్యుడు ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నాయకులు తహసిల్దార్ టి సత్యనారాయణను కలిసి విచ్చలవిడిగా జరుగుతున్న ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు కనిపించడం లేదని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్