నరసన్నపేట యుటిఎఫ్ మండల కార్యవర్గ సంఘం సమావేశం మంగళవారం సాయంత్రం నరసన్నపేట పిఎం శ్రీ ఉన్నత పాఠశాలలో జరిగింది. జిల్లా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. నక్క అప్పయ్య మండల అధ్యక్షులుగా, ఆర్ జగదీశ్వర్ రావు జనరల్ సెక్రెటరీగా, మరియు పలువురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని శ్రీరామ్ మూర్తి తెలిపారు.