సారవకోట మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్ ఎంఆర్సి కార్యాలయానికి చేరిందని ఎంఈవోలు మడ్డు వెంకటరమణ, కోడి భూలక్ష్మి తెలిపారు. సోమవారం ఎంఆర్సిలో మాట్లాడుతూ, మండలంలో 2,600 మంది
విద్యార్థులు ఉన్నారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో వారికి యూనిఫామ్ క్లాత్ అందజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు రావలసిన బూట్లు, ఇతర వస్తువులు కూడా త్వరలో వస్తాయని తెలిపారు.