Nov 11, 2025, 09:11 IST/
రంజీ ట్రోఫీలో ఢిల్లీపై జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం
Nov 11, 2025, 09:11 IST
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ టీమ్ రంజీ ట్రోఫీలో ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, 179 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ 133 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయపథంలో నడిపించాడు. ఆరు దశాబ్దాల తర్వాత ఈ విజయం సాధించడంతో ఆటగాళ్లు మైదానంలోనే సంబరాలు చేసుకున్నారు. ఈ విజయంతో ఆ జట్టు ఎలైట్ గ్రూప్ Dలో రెండవ స్థానానికి చేరుకుంది.