శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాటలో 9 మంది భక్తులు మరణించారు. ఆలయ సామర్థ్యం 2-3 వేలు ఉండగా, కార్తీక ఏకాదశి, శనివారం సందర్భంగా 25 వేలకు పైగా భక్తులు తరలివచ్చారు. దీంతో రెయిలింగ్ విరిగి, భక్తులు కిందపడిపోయి తొక్కిసలాటకు దారితీసింది. భారీగా భక్తులు రావడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.