పలాసలో మంగళవారం మధ్యాహ్నం శ్రీ వేంకటేశ్వర జువెలరీ షాపులో కిలో బంగారం చోరీ ఎలా జరిగిందో యజమాని రామకృష్ణారావు పోలీసులకు వివరించారు. 12 గంటల సమయంలో 8 మంది మాస్కులు ధరించి పోలీసులమని షాపులోకి ప్రవేశించారు. అద్దాలు పగలగొట్టారు. యజమాని చేతికి బేడీలు వేసి తుపాకీ ఆయన నుదిటిపై పెట్టారు. అరిస్తే చంపేస్తామని ముఖంపై కొట్టారు. అనంతరం షాపు, యజమాని ఒంటిపై ఉన్న బంగారం బ్యాగులో వేసుకున్నారు. 12.35 కి బయటకు వెళ్లిపోయారు.