మందస మండలం రట్టి గ్రామంలో డోలాపౌర్ణమి యాత్ర సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్లి అలల ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఆర్థి వాసుదేవ్(23) అనే యువకుడిని బారువా మెరైన్ పోలీసులు చాకచక్యంగా కాపాడారు. మెరైన్ సీఐ రమేశ్, ఏఎస్‌ఐ కోదండరావు ఆధ్వర్యంలో సిబ్బంది యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.