
'ఉసిళ్లు' తింటారని మీకు తెలుసా !
వానాకాలం రాగానే ఇళ్లలోకి చేరే ఉసిళ్లను అనేక ప్రాంతాల్లో ఆహారంగా తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ అలవాటు ఉంది. గ్రామీణులు వీటిని సేకరించి, ఎండబెట్టి, వేయించి తింటారు. అయితే, ఉసిళ్లు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనే వాదనకు శాస్త్రీయ ఆధారాలు తక్కువగా ఉన్నాయని పోషకాహార నిపుణులు తెలిపారు. ఆరోగ్యకరమైన పద్ధతిలో వండితే సమస్య లేదని వారు వెల్లడించారు.




