ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కలెక్టర్ కఠిన చర్యలు

1చూసినవారు
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కలెక్టర్ కఠిన చర్యలు
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి పలాస, మందస మండలాల్లో పర్యటించి, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ తవ్వకాలపై శుక్రవారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారిని బాధ్యులను చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్