పలాసలో కార్తీక మాసం శనివారం ఏకాదశి పర్వదినాన జరిగిన దుర్ఘటనలో 9 మందికి పైగా మృతి చెందడంపై జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పరిశీలన జరిగిందని, ఆయా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.