మందస మండలం బాలిగాం ఆదర్శ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఎం. లక్ష్మణరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 1 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 65 మంది విద్యార్థుల విద్యా ప్రగతిని, వర్క్ బుక్స్, అసెస్మెంట్ బుక్ లెట్స్, మూల్యాంకన పుస్తకాలను పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం మెనూను కూడా తనిఖీ చేశారు. డిసెంబర్ 5న జరగాల్సిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌ను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిషోర్ కుమార్ పాత్రో, బి. పురుషోత్తం, యానాది సుజాత పాల్గొన్నారు.