పలాసలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శనివారం పరామర్శించారు. ఘటనా స్థలానికి చేరుకుని, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించాలని, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు.