పలాస: కస్టం హైరింగ్ సెంటర్ ద్వారా అద్దెకు యంత్ర పరికరాలు

0చూసినవారు
పలాస: కస్టం హైరింగ్ సెంటర్ ద్వారా అద్దెకు యంత్ర పరికరాలు
పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం కస్టం హైరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. వ్యవసాయంలో యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోలేని రైతులకు అద్దె ప్రాతిపదికన పరికరాలు అందించడమే దీని లక్ష్యం. యంత్ర పరికరాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్న ఆమె, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ట్రాక్టర్ ను ప్రారంభించారు.

ట్యాగ్స్ :