ఆదివారం పలాస మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథ సాగర్ గట్టుతో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఎమ్మెల్యే గౌతు శిరీష వేగవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆమె, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌తో మాట్లాడుతూ, జగన్నాథ సాగర్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.