కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంతోనే నిరుపేదలకు భరోసా లభిస్తుందని తెలిపారు. శుక్రవారం పలాస మండలం రామకృష్ణాపురం గ్రామంలో ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. నిరుపేదల భరోసే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ప్రతి నెలా ఒకటవ తేదీనే పింఛన్లు అందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.