పలాస: జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు తగదు

52చూసినవారు
సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అప్రజాస్వామికం అని పలువురు వక్తలు వాపోయారు. శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు పలాస లోని కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే కారణంతో కక్ష సాధింపు చర్యలు చేపట్టడం తగదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్