కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని, మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.